షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించిన మెగా రక్తదాన శిబిరం

షెల్టన్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
రాజమహేంద్రవరం, జులై 29: ఆతిధ్య రంగంలో పేరెన్నకగన్న హోటల్ షెల్టన్ సంస్ధ సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణలో తనదైన పాత్ర పోషిస్తుందని ఓ.ఎన్.జి.సి.ఆఫీసర్స్ మహిళా సమితి అధ్యక్షురాలు డి.దుర్గా భవానీ అన్నారు. షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు షెల్టన్ హోటల్ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని దుర్గా భవాని ప్రారంభించారు. రక్త దానానికి ప్రజలు స్వచ్చందంగా రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసారు. షెల్టన్ ట్రస్ట్ ద్వారా కొడాలి తనూజ మెడికలు క్యాంపులు, విద్యార్థులకు బ్యాగ్ లు పంపిణీ చేయడం, కళ్ళ జోళ్ళు పంపిణీ చేయడం, అనాధ పిల్లలను అందుకోవడం, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వ్యాపార కాంక్ష మాత్రమే కాకుండా సమాజానికి తమ వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం నిరూపమానమని కొనియాడారు.కొడాలి తనూజ మాట్లాడుతూ షల్టన్ ట్రస్ట్ ద్వారా తాము చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ సహకరిస్తున్నారని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆపన్నులకు అండగా నిలిచి, పేద విద్యార్దులకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ భాస్కర్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ దుర్గ రాజు, షల్టన్ జనరల్ మేనేజర్ ఉపేంద్ర సింగ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్, ఎఫ్ అండ్ బి మేనేజర్ కృష్ణ, హౌస్ కీపింగ్ మేనేజర్ ఇబ్రహీం, హెచ్.ఆర్‌.మేనేజర్ అర్జున్, మార్కెటింగ్ మేనేజర్ ధర్మేంద్ర, బృందం, ఎగ్జిక్యూటివ్ చెఫ్ సయ్యద్ మెహబూబ్, ఐటి మేనేజర్ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

/ In Uncategorized / By admin / Comments Off on షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించిన మెగా రక్తదాన శిబిరం